ఆదిలాబాద్ : సిమెంట్ పరిశ్రమ ( Cement Plan ) ను పునరుద్ధరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని మాజీ మంత్రి జోగు రామన్న( Jogu Ramanna ) అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) పిలుపుమేరకు ఆదివారం ఆదిలాబాదు లో సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టారు. సీసీఐ ని ప్రారంభిం చడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు.
వేలాది మందికి ఉపాధి కల్పించే పరిశ్రమను, ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షా గతంలో జిల్లా పర్యటనలో భాగంగా సీసీఐ ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారని తెలిపారు. సీసీఐని ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ తాను త్వరలోనే అమరణ దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు.