లాహోర్: 19 ఏండ్ల నిషేధం తర్వాత పాకిస్థాన్లో శుక్రవారం మళ్లీ వసంత పండగ ప్రారంభమైంది. లాహోర్లో ఈ పండుగ సందడి బాగా కనిపిస్తున్నది. మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగలో ఇండ్ల డాబాలపైన, హోటళ్ల పైన రంగు రంగుల పతంగులు ఎగరవేస్తారు.
భారత ఉప ఖండంలోని హిందూ సమాజంలో, సూఫీ సంప్రదాయంలో వసంత పండుగల మూలాలు దాగి ఉన్నాయి. వసంత ఆగమనానికి సూచికగా ఈ పండుగను జరుపుకొంటారు.