కారేపల్లి, జనవరి 23 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల తెలంగాణ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల/కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు సంబంధించిన ప్రచార పత్రాన్ని శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా మైనార్టీ సంక్షేమ కో ఆర్డినేటర్ అరుణకుమారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఖాళీగా ఉన్న సీట్లు అన్నింటిని అర్హతను బట్టి భర్తీ చేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ దారా సావిత్రి, బోధన సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.