జైపూర్: మర్డర్ కేసుల్లో జీవితకాల జైలుశిక్ష అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు ప్రేమలో పడ్డారు. ఆ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతున్నది. ప్రస్తుతం జైపూర్ జైలు(Rajasthan Jail)లో ఆ జంట ఉంటోంది. పెళ్లి నేపథ్యంలో ఆ ఖైదీలు 15 రోజుల పెరోల్ కల్పించారు. లేడీ ఖైదీ ప్రియా సేథ్.. హనుమాన్ ప్రసాద్ పెళ్లికి జైలు అధికారులు ఓకే చెప్పేశారు. సంగనేర్ ఓపెన్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఆ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. ప్రియా వయసు 34 ఏళ్లు.. హనుమాన్ ప్రసాద్ వయసు 29 ఏళ్లు. రాజస్థాన్ హైకోర్టు జనవరి ఏడో తేదీన ఇచ్చిన ఆదేశాల ప్రకారం పెరోల్ గ్రాంట్ చేశారు.
ప్రియా సేథ్ మరో పేరు నేహా సేత్. దుశ్యంత్ శర్మ మర్డర్ కేసులో ఆమె ప్రధాన నిందితురాలు. డేటింగ్ యాప్ ద్వారా శర్మను వశపరుచుకుని ఆ తర్వాత మర్డర్ చేసినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకు చెందిన భర్త, ఆమె పిల్లలను చంపిన కేసులో హనుమాన్ ప్రసాద్ జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఈ ఖైదీలు ఇద్దరూ ప్రేమలో పడ్డారు. వారి దరఖాస్తు ఆధారంగా జిల్లా పెరోల్ అడ్వైజరీ కమిటీ పెరోల్ జారీ చేసింది.
అల్వార్ జిల్లాలోని బరోడా మేవ్ ఏరియాలో పెళ్లి చేసుకోనున్నారు.