శ్రీకార్తీక్ (Shree Karthick) దర్శకత్వంలో శర్వానంద్ (Sharwanand) హీరోగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (Oke Oka Jeevitham). అక్కినేని అమల కీ రోల్లో నటించగా..రీతూ వర్మ హీరోయిన్గా నటించింది. తల్లీకొడుకుల సెంటిమెంట్, టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. చాలా కాలంగా మంచి బ్రేక్ కోసంఎదురుచూస్తున్న శర్వానంద్‌కు ఈ సినిమాతో మంచి హిట్టు పడినట్టేనంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
టైం ట్రావెల్ కాన్సెప్ట్‌ను, భావోద్వేగాలను బ్యాలెన్స్ చేస్తూ తెరకెక్కించిన విధానానికి ఫిదా అవుతున్నారు సినీ జనాలు. వెన్నెల కిశోర్, ప్రియదర్శి కీ రోల్స్ చేశారు. ఈ సినిమా అద్బుతంగా ఉందని హైదరాబాదీ సుందరి అదితీ రావు హైదరి ట్వీట్ చేసింది.
కన్నీళ్లు తెప్పించి..నా హృదయాన్ని నవ్వించినందుకు ధన్యవాదాలు. విశ్వంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి గురించి సినిమా తీసినందుకు ధన్యవాదాలు. అమ్మలు నిజంగా ప్రపంచాన్ని ఉత్తమ ప్రదేశంగా మారుస్తారు..రత్నం లాంటి ఈ సినిమాను మీ అమ్మలను తీసికెళ్లి చూడండి..ధన్యవాదాలు..అని ట్వీట్ చేసింది.
Thank you for the tears & for making my heart smile. Thank u for making a film about the most important human in the universe. Ammas truly make the world a better place.
Go watch this gem of a film &take your ammas with u. Thank you for #OkeOkaJeevitham @twittshrees @prabhu_sr pic.twitter.com/san8NN7L6Z— Aditi Rao Hydari (@aditiraohydari) September 10, 2022
Read Also : రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత