Robbery Gang Arrest | దారి దోపిడీ ముఠా సభ్యుల అరెస్ట్..తపంచాలు, కత్తులు స్వాధీనం
Robbery Gang Arrest | జాతీయ రహదారిపై దారి దోపిడీల(Robbery Gang )కు పాల్పడుతున్న ఏడుగురు ముఠా సభ్యులను ఆదిలాబాద్ పోలీసులు(Adilabad police) అరెస్టు చేశారు.
ఆదిలాబాద్ : జాతీయ రహదారిపై దారి దోపిడీల(Robbery Gang )కు పాల్పడుతున్న ఏడుగురు ముఠా సభ్యులను ఆదిలాబాద్ పోలీసులు(Adilabad police) అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
నిర్మల్(Nirmal) జిల్లా సారంగాపూర్ మండలం స్వర్ణ మదర్సా కు చెందిన ఉపాధ్యాయుడు మహ్మద్ హర్షత్, ఉత్తరప్రదేశ్(UP) కు చెందిన జాకీర్ ఖాన్, ముజాహిద్ ఖాన్, రాజస్థాన్(Rajastan) కు చెందిన నసీం, జాఫర్ ఖాన్, నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లికి చెందిన మహమ్మద్ సాజిద్ ఖాన్ కొన్ని రోజులుగా ఆదిలాబాద్ -హైదరాబాద్ జాతీయ రహదారి(National Highway)పై వాహనాలను లక్ష్యంగా చేసుకొని దోపిడీకి పాల్పడుతున్నారు.

ఈనెల 13న హల్దీరాం ప్యాకెట్లతో హైదరాబాద్ నుంచి నాగపూర్ వెళ్తున్న కంటైనర్ డ్రైవర్లను తుపాకులు, కత్తులతో బెదిరించి ముఠా సభ్యులు దోపిడీకి పాల్పడ్డారు. బాధితులు ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్ఐఆర్(FIR) నమోదు చేసుకున్న పోలీసులు ఏడుగురు ముఠా సభ్యులను శనివారం అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
వీరి వద్ద నుంచి రూ.4 లక్షలు విలువ చేసే హల్దీరాం ప్యాకెట్లు, రూ1. 52 లక్షలు విలువ చేసే ఫ్లిఫ్ కార్ట్ పార్సెల్, రెండు కంట్రీమేడ్ తపంచాలు(country-made pistols), రెండు కత్తులు, రాడ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

