ఆదిలాబాద్ రూరల్, జూన్ 8 : కార్పొరేట్ దవాఖానలో వైద్య చికిత్స చేయించుకున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తున్నదని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం 12 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ఇప్పటి వరకు నియోజకవర్గంలో 2వేల మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 57 సంవత్సరాలు నిండిన వారికి పింఛన్ సదుపాయాన్ని త్వరలో కల్పించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ప్రకాశ్, పందిరి భూమన్న, నాయకులు రాంకుమార్, గణేశ్, తదితరులు పాల్గొన్నారు.