ఆదిలాబాద్, మార్చి 2 (నమస్తే తెలం గాణ ప్రతినిధి) : ఉమ్మడి రాష్ట్రంలో ఆది లాబాద్ జిల్లాలో అస్తవ్యస్తంగా ఉన్న వైద్య సేవలు ప్రత్యేక రాష్ట్రంలో ప్రజలకు మరింత చేరువయ్యాయి. తెలంగాణ సర్కారు పక డ్బందీ ప్రణాళికతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో వ్యాధుల నియంత్రణతో పాటు మరణాలూ తగ్గాయి. ప్రభుత్వ వైద్యశాలల్లో వసతుల కల్పన, డాక్టర్లు, సిబ్బంది నియామకం, వివిధ రకాల మందులు, గర్భిణులకు స్కానింగ్ పరీక్షలు, దవాఖానలకు వచ్చేవారి 51 రకాల వైద్య పరీక్షలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చింది.
దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు పెరగడంతో పాటు, ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య పెరిగింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా లాంటి వ్యాధులను సైతం సర్కారు నియం త్రించగలిగింది. ఉమ్మడి జిల్లాల్లో ఆస్పత్రులతో పాటు, కమ్యూనిటీ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వసతుల లభిస్తున్నారు. జిల్లాలో ప్రజలకు అందుతున్న వైద్యసేవలను సమీక్షిం చడంతో పాటు వైద్యసేవలను మరింత మెరుగుపర్చే విధంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు నేటి నుంచి రెండ్రోజుల పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.
దవాఖాన భవనాలకు శంకుస్థాపనలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండ్రోజుల పర్య టనలో భాగంగా మంత్రి టీ హరీశ్‌రావు రాత్రి బాసరకు చేరుకున్నారు. గురు, శుక్రవారాల్లో జిల్లా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 7.10 గంటలకు మంత్రి అమ్మవారిని దర్శించుకుంటారు. బాసర నుంచి బయలుదేరి 9.20 గంటలకు ముథోల్‌కు చేరుకుం టారు. 30 పడకల వైద్యశాల భవనానికి శంకుస్థాపన చేసి అక్కడ నిర్వహించే బహిరంగసభకు హాజర వుతారు. ఉదయం 11.15 గంటలకు నర్సాపూర్ (జీ) కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను పరిశీలి స్తారు. మధ్యాహ్నం 12.15 గంటలకు నిర్మల్ ఏరియా దవాఖానలో రేడియాలజీ ల్యాబ్‌కు శంకుస్థాపన చేస్తారు.
అనంతరం కేర్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. పట్టణంలో రూ.41 కోట్లతో చేపట్టనున్న 250 పడ కల దవాఖాన భవన నిర్మాణానికి భూమిపూజ చేస్తా రు. మధ్యాహ్నం 1 గంటకు దివ్యాగార్డెన్‌లో నిర్వ హించే బహిరంగ సభలో మంత్రి పాల్గొంటారు. మధ్యాహ్నం 3.15 గంటలకు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లో స్థానికంగా నిర్వహించే కార్యక్ర మాలకు హాజరవుతారు. ఆదిలాబాద్‌లో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవనాన్ని మంత్రులు హరీష్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి సాయంత్రం 4గంటల కు ప్రారంభిస్తారు. అనంతరం రేడియాలజీ ల్యాబ్ కు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 5గంటలకు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల వైద్యశాఖ అధికారులు, రిమ్స్ అధికారులతో సమావేశం నిర్వ హిస్తారు.
అనంతరం ఆదిలాబాద్‌లో రాత్రి బస చేసి శుక్ర వారం ఉదయం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచి ర్యాల జిల్లాల పర్యటనకు వెళ్తారు. ఉట్నూర్ కమ్యూ నిటీ వైద్యశాలను 9.30 గంటలకు సందర్శి స్తారు. 11.10 గంటలకు ఆసిఫాబాద్ కమ్యూనిటీ అస్పత్రి అప్‌గ్రేడేషన్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం రేడియాలజీ ల్యాబ్‌కు శంకుస్థాపన, చిన్నపిల్లల కేర్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు కాగజ్‌నగర్‌లో అన్నదాన సత్రాన్ని మంత్రి సందర్శి స్తారు. మధ్యాహ్నం 3 గంటలకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చేరుకొని వాటర్‌గ్రిడ్ ఈఈ కార్యాలయా న్ని ప్రారంభిస్తారు. తర్వాత దవాఖాన భవన నిర్మా ణాన్ని పరిశీలించి బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు మందమర్రికి చేరు కొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు.
సాయంత్రం 5.30 గంటలకు క్యాతన పల్లిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. మంచిర్యాలలో జిల్లా దవాఖానలో కొత్తగా నిర్మిం చనున్న నర్సింగ్ కళాశాలకు సాయంత్రం 6.30 గంటలకు శంకుస్థాపన చేస్తారు. 100 పడకల ఎం సీహెచ్ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం డయా గ్నస్టిక్ హబ్, పాథాలజీ ల్యాబ్‌కు శంకుస్థాపన, చిన్న పిల్లల కేర్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. సాయం త్రం7 గంటలకు కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచి ర్యా ల జిల్లాల వైద్యాధికారులతో సమావేశం నిర్వహిస్తారు.