నిర్మల్ అర్బన్, మార్చి 2 : నిర్మల్ జిల్లా కేం ద్రంలో గురువారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీ రు హరీశ్ రావు పర్యటించనున్నారు. పలు అభివృ ద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నా రు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు. దివ్యనగర్ కాలనీలో జిల్లా వైద్యశాల నిర్మాణ స్థలం, ఏరియా దవాఖాన, ప్రసూతి వైద్యశాలను పరిశీలించారు. ఏర్పాట్లకు సంబంధించి పలు సూచనలు చేశారు. మంత్రి వెంట కలెక్టర్ ముషార ఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్క డే, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, దవాఖాన సూపరింటెండెంట్ దేవేందర్ రెడ్డి ఉన్నారు.
ఏర్పాట్లు పూర్తి
నిర్మల్ టౌన్, మార్చి 2 : రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పూర్తి చేశామని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో మంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులతో బుధవారం రాత్రి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. గురువారం ఉదయం 9 గంటలకే బాసరకు చేరుకోనున్న మంత్రి హరీశ్‌రావు, స్థానిక మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి బాసర అమ్మవారి దర్శనం, శివాజీ విగ్రహ ప్రతిష్ఠాపన, ముథోల్, నర్సాపూర్(జీ) సామాజిక వైద్యశాలల సందర్శన ఉంటుందని తెలిపారు.
అనంతరం నిర్మల్‌లో రేడియోలాజీ ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారని పేర్కొన్నారు. అనంతరం నిర్మల్ జిల్లా కేంద్రంలో రూ.40 లక్షలతో నిర్మించే దవాఖాన నిర్మాణ పనులను ప్రారంభించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను వైద్య ఆరోగ్యశాఖ చూసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని ఆరోగ్య పథకాల అమలు, ఏమైనా సమస్యలుంటే మంత్రి దృష్టికి తీసుకొస్తే పరిష్కారమవుతాయని గుర్తు చేశారు. కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్‌బోర్కడే, స్థానిక అధికారులు, నాయకులున్నారు.