ఉట్నూర్, మార్చి 2 : దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సిబ్బందికి సూచించారు. మండలకేంద్రంలోని కమ్యూనిటీ దవాఖానను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అంకిత్‌తో కలిసి బుధవారం పరిశీలించారు. దవాఖానలోని పలు విభాగాల గురించి సూపరింటెండెంట్ డాక్టర్ ఉపేందర్‌ను అడిగి తెలుసుకున్నారు. గర్భిణులకు వైద్య పరీక్షలు, పౌష్టికాహారం, కేసీఆర్ కిట్, ఐసీయూ, డయాలసిస్ సెంటర్, ఇంక్యుబేటరీ గదులను పరిశీలించారు.
ఏజెన్సీ మండలాల నుంచి వచ్చిన చి న్నారులకు ఎన్ఆర్సీలో అందుతున్న సేవల గురిం చి అడిగి తెలుసుకున్నారు. ఏజెన్సీ ఏరియాలో గైనకాలజిస్ట్, ఇతర వైద్యులతో పాటు అంబులెన్స్‌ల కొరత ఉందని డీఎంహెచ్‌వో మనోహర్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో రాష్ట్ర వైద్య ఆ రోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు గురువారం జిల్లా లో పర్యటించనున్నారని అధికారులకు సూచించా రు. ఇందులో భాగంగా ఉట్నూర్ సీహెచ్‌సీని సందర్శిస్తారని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూ చించారు. వైద్యులు మహేందర్, కపిల్, పుష్కర్, శ్రావణ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.