ఇంద్రవెల్లి, మార్చి 2 : కేస్లాపూర్ గ్రామంలోని నాగోబా ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ముగిశాయి. గ్రామ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ పటేల్ మెస్రం వెంకట్రావ్ పటేల్, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కోసేరావ్, ప్రధాన కార్యదర్శి కోవ సురేశ్, సర్పంచ్ రేణుకానాగ్‌నాథ్, గ్రామస్తులు, ఆలయ పూజారి మెస్రం షేకు, సాగర్, మనోజ్, తదితరులు పాల్గొన్నారు.
నందీశ్వర ఆలయంలో..
బేల, మార్చి 2 : బాది గ్రామంలోని నందీశ్వర ఆలయంలో బుధవారం భక్తుల సందడి నెలకొంది. ఉపవాస దీక్షలు విరమించి భక్తులు ఆలయంలో శివలింగం, నందీశ్వరుడి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. మండలంతో పాటు మహారాష్ట్ర నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జాతరలో ఏర్పాటు చేసిన దుకాణాల్లో భక్తులు ఆట వస్తువులు కొనుగోలు చేశారు.
వైభవంగా శివపార్వతుల కల్యాణం
బోథ్, మార్చి 2 : మండల కేంద్రంలోని పంచముఖి హనుమాన్ ఆలయంలో మంగళవారం రాత్రి శివపార్వతుల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వేద పండితులు అరవింద్‌శర్మ, సదానందశర్మ, సంతోష్ కుమార్‌శర్మ శాస్ర్తోయుక్తంగా లింగాష్టకాన్ని పఠిస్తూ కల్యాణం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి కల్యాణాన్ని తిలకించారు.
శివాలయంలో ప్రత్యేక పూజలు
ఉట్నూర్ రూరల్, మార్చి 2 : సాలెవాడ(కే) గ్రామంలోని శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు ముగిశాయి. ఉపవాస దీక్షలు ముగింపు సందర్భంగా జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా గ్రామస్తులు జడ్పీచైర్మన్ను ఆత్మీయంగా ఆహ్వానించి సత్కరించారు. అనంతరం గ్రామంలో జడ్పీచైర్మన్ పల్లకీ మోశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రవీందర్, నాయకులు రమేశ్, గంగారాం, మాజీ సర్పంచ్ మర్సుకోల తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
అన్నదానం
సిరికొండ, మార్చి 2: మండల కేంద్రంతో పాటు కొండాపూర్, రాయిగూడ, సుంకిడి గ్రామాల్లోని శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కొండాపూర్ పురాతన శివాలయానికి ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నదానం కోసం రూ.10 వేలు కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
విఠల్రుక్మాయి ఆలయంలో…
ఇంద్రవెల్లి, మార్చి 2: మహాశివరాత్రి, ఉపవాస దీక్షలు ముగింపు సందర్భంగా మండల కేంద్రంలోని భీంనగర్ విఠల్రుక్మాయి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఆలయం నుంచి పల్లకీతో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో మహారాజ్ మోహన్, భక్తులు దేవీదాస్, సంతోష్, విశ్వనాథ్, సంజీవ్, గోవింద్, నాందేవ్ పాల్గొన్నారు.
వడ్డాడిలో మాజీ ఎంపీ పూజలు
తాంసి, మార్చి 2: వడ్డాడి గ్రామంలోని లింబాద్రి లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో ఆదిలాబాద్ మాజీ ఎంపీ నగేశ్ ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఆలయాలకు పూర్వవైభవం వచ్చిందని అన్నారు. ఆయన వెంట జడ్పీటీసీ రాజు, సర్పంచ్ శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అరుణ్‌కుమార్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, వీడీసీ చైర్మన్ ప్రకాశ్, నాయకులు ఉన్నారు.