ఉట్నూర్, జూన్ 1 : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూసానికి బుధవారం రంగులు వేసి లైటింగ్ అమర్చారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రంగురంగుల విద్యుత్‌దీపాలు వేశారు. ఐటీడీఏ, మండల కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగురవేసేందుకు అన్నీ సిద్ధం చేస్తున్నారు. ఈవో శంకర్, జీపీ కార్మికుడు మనోహర్ పాల్గొన్నారు.
తాంసి, జూన్ 1 : మండలంలో రాష్ట్ర అవతరణ వేడుకలు జూన్ 2న ఘనంగా నిర్వహిస్తామని, అందరూ పాల్గొని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ మండల కన్వీనర్ అరుణ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రంలో ఉద యం 8 గంటలకు జెండా ఆవిష్కరణ ఉంటుందని పేర్కొన్నా రు. ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కా ర్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజవంతం చేయాలని కోరారు.
భీంపూర్, జూన్ 1: భీంపూర్ తహసీల్, మండల పరిషత్ సహా 26 పంచాయతీ కార్యాలయాల్లో గురువారం నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సంబంధించి బుధవారం అధికారులు, సర్పంచులు ఏర్పాట్లు చేశారు. పతాకావిష్కరణ తర్వాత సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన మండల ప్రగతి నివేదికలను మండలాధికారులు చదివి వినిపించనున్నారు.
ఇంద్రవెల్లి, జూన్ 1 : గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం క్రీడామైదానాలను నిర్మిస్తున్నది. మండలంలోని ముత్నూర్, దస్నాపూర్ గ్రామ పంచాయతీల పరిధిలో క్రీడామైదానం ఏర్పాటు పనులను ముమ్మరంగా చేపడుతున్నారు. ముత్నూర్‌లో ఇప్పటికే ప్రత్యేక బోర్డు సైతం ఏర్పాటు చేశారు. సర్పంచ్ తుంరం భాగుబాయి దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. క్రీడామైదానంలో ఎర్రమట్టి వేసి చదును చేస్తున్నారు. గురువారం ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నారు. ఈజీఎస్ అధికారులు పాల్గొన్నారు.
బేల,జూన్ 1 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లె ప్రగతి లో భాగంగా చేపట్టనున్న పల్లె క్రీడా మైదానం చప్రాల గ్రామం లో పూర్తయ్యింది. దీన్ని గురువారం ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ప్రారంభించనున్నట్లు టీఆర్ఎస్ మండలాధ్యక్షు డు కళ్యాం ప్రమోద్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. టీఆర్ఎస్ మండల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.