
ఇంద్రవెల్లి, నవంబర్ 2 : రాష్ట్ర ప్రభుత్వం దం డారీ ఉత్సవాలను గుర్తించిందని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉత్సవాల నిర్వహణకు రూ. కోటి మంజూరుచేసిందని మాజీ ఎంపీ గొడాం నగేశ్, ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్ అన్నారు. మండలంలోని గట్టేపల్లిలో మంగళవారం గ్రామస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దండారీ ఉత్సవా ల్లో వారు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. గ్రా మస్తులతో పాటు గుస్సాడీ బృందంతో వారికి ఘ నస్వాగతం పలికారు. అనంతరం ఏత్మాసూర్ దే వతకు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులు వా రిని శాలువాలతో సన్మానించారు. అనంతరం రూ.10వేల చొప్పున ప్రభుత్వం మంజూరుచేసిన నిధులను దండారీ నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదివాసులు దీపావళి సందర్భంగా గ్రామాల్లో జరుపుకునే దండారీ ఉత్సవాలకు దేశంలో ప్రత్యే క గుర్తింపు ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లతో హైదరాబాద్‌లో ఆదివాసీ భవనం నిర్మించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, మాజీ ఎంపీపీ కనక తుకారాం, గ్రామ పటేల్ కుమ్ర డోంగర్రావ్పటేల్, సర్పంచ్ కుమ్ర మోహన్రా వ్, ఎంపీటీసీలు కుమ్ర జంగుబాయి, కోవ రాజేశ్వర్, మాజీ ఎంపీటీసీ కనక హనుమంత్‌రావ్, టీఆర్ఎస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు షేక్ సు ఫియాన్, ఆదివాసీ గిరిజన నాయకులు కోరెంగ సుంకట్రావ్, మెస్రం తుకారాం, కోరెంగ సుంగు, తొడసం హరిదాస్, ఆత్రం ధర్ము, కుమ్ర రాంషావ్, కుమ్ర విఠల్‌రావ్, గోవింద్‌రావ్, జంగు, నార్నూర్ మండల నాయకులు ప్రభాకర్, చంద్రశేఖర్, అశోక్, ఉత్తమ్ పాల్గొన్నారు.