Home
Telangana
Additional Classrooms Built With Mp Damodar Raos Funds Inaugurated At Metpally Govt High School
ఎంపీ దామోదర్‌రావు నిధులతో అదనపు తరగతి గదులు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యావసతులు కల్పించడమే తన లక్ష్యమని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు.
- జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభం
- విద్యావసతులు కల్పించడమే లక్ష్యం
- కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
మెట్పల్లి, నవంబర్ 21: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యావసతులు కల్పించడమే తన లక్ష్యమని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. శనివారం జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్‌రావు తన ఎంపీ కోటా నుంచి మంజూరు చేసిన రూ.40 లక్షల నిధులతో రెండు అదనపు తరగతి గదులు, కలెక్టర్ ప్రత్యేక నిధుల నుంచి కేటాయించిన రూ.37లక్షలతో నిర్మించిన రెండు తరగతి గదుల సముదాయం, వంటశాల షెడ్డును ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. పాఠశాలలో సరిపడా తరగతి గదులు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్న విషయం పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని మండిపడ్డారు. అడిగిన వెంటనే అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం నిధులు కేటాయించిన ఎంపీ దామోదర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

