మెల్బోర్న్: ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా పెళ్లి చేసుకోబోతున్నాడు. దీంతో ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆడే తొలి మ్యాచ్‌కు అతడు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మైక్ హెసన్ ధృవీకరించారు. ఏప్రిల్ 9న తన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో ఆర్సీబీ తలపడనుంది. తొలి మ్యాచ్‌కు పూర్తి స్థాయిలో విదేశీ ప్లేయర్స్ అందుబాటులో ఉండటం లేదని, ఆడమ్ జంపా పెళ్లి చేసుకోబోతున్నాడని హెసన్ చెప్పారు. ఐపీఎల్ కోసం మార్చి 29 నుంచి ఆర్సీబీ తమ ట్రైనింగ్ క్యాంప్‌ను ప్రారంభించబోతోంది. గతేడాది ఆర్సీబీ తరఫున జంపా కేవలం మూడు మ్యాచ్‌లే ఆడి రెండు వికెట్లు తీసుకున్నాడు.
RCB’s IPL 2021 Camp and Player Availability
— Royal Challengers Bangalore (@RCBTweets) March 24, 2021
When’s the pre-season camp starting? When are the overseas players arriving? On @myntra presents Bold Diaries, Mike Hesson leaves no room for speculations ahead of #VivoIPL2021.#PlayBold #WeAreChallengers #IPL2021 #Classof2021 pic.twitter.com/yxBFNYVwW8