తెలుగు చిత్రసీమలో కరోనా కలకలం రేపుతున్నది. పలువురు అగ్రనటీనటులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కొద్ది రోజులుగా ఆయన జలుబు, జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. కరోనా పరీక్ష చేసుకోగా పాజిటివ్‌గా తేలింది. ఆయన గచ్చిబౌలిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్లు తెలిసింది. ప్రస్తుతం రాజేంద్రప్రసాద్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. రాజేంద్రప్రసాద్ కరోనా బారిన పడటంతో ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఎఫ్-3’ షూటింగ్‌ను నిలిపివేసినట్లు తెలిసింది.