Arvind krishna | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ అరవింద్ కృష్ణ (Arvind krishna). ఆలస్యం అమృతం, ఇట్స్ మై లవ్ స్టోరీ, ఆంధ్రాపోరీ, ప్రేమమ్, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలతో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
అరవింద్ కృష్ణ యాక్టరే కాకుండా ఇంటర్నేషనల్ అథ్లెట్ అని తెలిసిందే. ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ ‘వరల్డ్ అపార్ట్’ (WORLDS APART) అనే పుస్తకానికి ముందు మాట రాశాడు. ఎడ్ కోహెన్, దేవి బొడ్డు రాసిన ఈ నాన్ ఫిక్షన్ రచనా పుస్తకాన్ని ఓం బుక్స్ ఇంటర్నేషనల్ ప్రచురించింది.
‘నాయకత్వం అంటే గదిలో అత్యంత గట్టిగా మాట్లాడటం కాదు.. స్పష్టంగా మాట్లాడటం.. అధికారాన్ని ప్రయోగించడం కాదు.. నిజాయితీగా ఉండటమే నాయకత్వం..’ అని ఈ పుస్తకంలో ముందు మాట రాశాడు. వరల్డ్ అపార్ట్ పుస్తకం ఇండియాలోని మెయిన్ బుక్ షాప్స్తోపాటు ఆన్లైన్ ప్లాట్‌ఫాంలలో అందుబాటులో ఉంది. భారతదేశ విలువలు, సంస్కృతి, సాంకేతికతలోని పరిణామ క్రమం గురించి ఎన్నో విషయాలను పొందుపరిచారు.
మొత్తానికి ఇప్పటిదాకా యాక్టర్‌గా, బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అరవింద్ కృష్ణ ఒక పుస్తకానికి ముందు మాట రాసి రైటర్‌గా కూడా మారాడని చర్చించుకుంటున్నారు మూవీ లవర్స్. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు అరవింద్ కృష్ణ.
NBK 111 | బాలయ్య – గోపీచంద్ మలినేని పీరియాడిక్ మూవీ షూటింగ్ షురూ!
Rai Rai Raa Raa | యూట్యూబ్‌లో ‘పెద్ది’ ట్రెండింగ్.. నంబర్ 1 స్థానంలో ‘రై రై రా రా’ సాంగ్!
Team India | ప్రతి మ్యాచ్‌కి ముందు గుడిలో పూజలు? టీమిండియా ఆలయ సందర్శనపై నెటిజన్ల ఫైర్!