ధర్మసాగర్ : క్రీడల పట్ల యువత ఆసక్తిని పెంచుకోవాలని, క్రీడలతో యువత పై స్థాయికి ఎదగాలని కాజీపేట ఏసీపీ పింగళి ప్రశాంత్ రెడ్డి సూచించారు. బుధవారం ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో ముప్పారం ప్రిమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ బహుమతుల ప్రధాన కార్యక్రమానికి ఏసీపీ ప్రశాంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.
మొదటి బహుమతి ముప్పారం అరవింద్ టీమ్ కి షీల్డ్ తో పాటు, రూ.10వేల నగదు, రన్నరప్ సన్నీ టీమ్ రూ.5వేల నగదు ను అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గుంటిపల్లి రేణుక, ఉపసర్పంచ్ తాల్లపెళ్లి కుమారస్వామి, మాజీ ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్, నాయకులు మహేందర్ రెడ్డి, రమేష్ రెడ్డి, గుంటిపల్లి వెంకట్, కోతి సాంబరాజు తదితరులు పాల్గొన్నారు.