రామవరం, జూలై 31 : ఏదైనా పని చెబితే దాన్ని పూర్తి చేస్తాడే కాని ఏ రోజు కూడా కారణాలు చెప్పకుండా అంకితభావంతో పనిచేసిన గొప్ప మనిషి అచ్యుత రామయ్య అని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు అన్నారు. కొత్తగూడెం ఏరియా సివిల్ డిపార్ట్మెంట్లో డివై ఎస్.సి విధులు నిర్వహిస్తూ గురువారం పదవీ విరమణ పొందిన సందర్భంగా ఏరియా సివిల్ కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి రుద్రంపూర్ కమ్యూనిటీ హాల్లో సన్మాన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏరియా జిఎం, సివిల్ జిఎం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. అచ్యుతరామయ్య దంపతులను గజమాల, శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా జిఎం సివిల్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అచ్యుత రామయ్య అంకితభావంతో పని చేయడం కాకుండా క్రమశిక్షణతో స్నేహ పూర్వకంగా మెలిగి అందరి మన్ననలు పొందారన్నారు. విశ్రాంత జీవితం సుఖశాంతులతో, ఆయురారోగ్యంతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
విశిష్ట అతిథి శాలెం రాజు మాట్లాడుతూ.. సేవా భావం, అంకిత భావం, సమయ స్ఫూర్తి, ఓర్పు, నేర్పు, క్రమశిక్షణ అనే పదాలు అచ్యుత రామయ్య నుండి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన భవిష్యత్ మహోన్నతంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
కారణాలు వెతకకుండా అప్పగించిన పనిని ఓర్పుతో, నేర్పుతో చేయడం అచ్యుతరామయ్యకే చెల్లుతుందని కొత్తగూడెం ఏరియా సివిల్ ఏజీఎం సీహెచ్ రామకృష్ణ అన్నారు. ఏరియా సివిల్ కార్యాలయంలో నిర్వహించిన అచ్యుతరామయ్య పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని దంపతులను గజమాల, శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భాన్ని సివిల్ ఏజీఎం మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లతో కావాల్సిన పనిని ఎలా తీసుకోవాలో అచ్యుతరామయ్యకు తెలిసిన విద్య మరెవరికి రాదని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఏరియా ఏజీఎం సీహెచ్ రామకృష్ణ, డివై ఎస్ ఈ రాజారామ్, ఈఈ సుమంత్, సూపర్వైజర్లు శ్రీనివాస్, షబ్బీర్, సివిల్ కాంట్రాక్టర్లు గుట్టకింద. శ్రీనివాస్, చిట్టి సంపత్ కుమార్ రెడ్డి, కృష్ణారెడ్డి, పటాన్ ఖాసీం, కృష్ణమూర్తి, గోపాల్, సిరిసిల్ల రమేశ్, పత్తిపాటి వెంకటేశ్వర్లు, కుమారస్వామి, కిశోర్, ముకుందం, గోపాలకృష్ణ, పల్లపు శ్రీనివాస్, పల్లపు వెంకటేశ్వర్లు, మేఘనాథ్, పెనుగడప సుధాకర్, సంపత్, గాదం రమేశ్, మాధవ చక్రవర్తి పాల్గొన్నారు.
Ramavaram : అచ్యుత రామయ్య అంకితభావం అభినందనీయం : జీఎం శాలెం రాజు