గోల్నాక, నవంబర్ 11: నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల అభివృద్ధి వేగవంతం చేశామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. ఇందుకు సంబంధించి కోట్లాది రూపాయల వ్యయంతో కొత్త రహదారులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గురువారం గోల్నాక డివిజన్లోని అన్నపూర్ణనగర్‌లో రూ.33 లక్షల వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ దూసరి లావణ్యశ్రీనివాస్గౌడ్తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా మౌలిక వసుతుల కల్పనకు అధిక ప్రాధన్యతనిస్తున్నామన్నారు. తాను ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చిన ప్రకారం త్వరలోనే హిందూ, ముస్లిం శ్మశాన వాటికలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.
వీటి నిర్మాణ పనులు వేగవంతం చేస్తామని ఆయన తెలిపారు. రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ, మంచినీటి, వరదనీటి పైపులైన్లు, వీధి దీపాల ఏర్పాటు, పార్కుల సుందరీకరణ తదితర వసతుల ఏర్పాటు పనులను ముమ్మరంగా చేపడుతున్నామన్నారు. అనంతరం బస్తీలో పాదయాత్ర చేసి స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలు వెంటనే పరిష్కరిస్తానని ఆయన స్థానికులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ శంకర్, డీఈ సుధాకర్, ఏఈ ఫరీద్, వర్క్ఇన్స్పెక్టర్ మనోహర్, శానిటరీ ఇన్స్పెక్టర్ తిరుపతి, ఏఎంహెచ్‌వో జ్యోతి, జలమండలి అధికారులు రోహిత్, అశ్వక్, విద్యుత్ శాఖ అధికారులు వెంకటరమణ, ప్రసాద్, స్థానిక టీఆర్ఎస్ నాయకులు కె.శ్రీనివాస్, జనార్దన్, భరత్ముదిరాజ్, రాము, ఆర్కే బాబు. నర్సింగ్‌యాదవ్, బుచ్చిరెడ్డి, లింగం యాదవ్, బస్తీ వాసులు గఫూర్, శ్రీను, లక్ష్మణ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.