India Vs Ban | ఎమర్జింగ్ ఆసియాకప్‌లో యంగ్ ఇండియా, బంగ్లా క్రికెటర్ల మధ్య గొడవ.. వీడియో వైరల్
ACC Emerging Teams Asia Cup | శ్రీలంక వేదికగా జరుగుతున్న ఎసీసీ ఎమర్జింగ్ ఆసియాకప్‌లో యువ భారత జట్టు ఫైనల్‌కు చేరింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో యంగ్‌ఇండియా 51 పరుగుల తేడాతో బంగ్లాదేశ్-‘ఎ’ను చిత్తుచేసింది. దీంతో ఇండియా-ఎ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది.
Asia Cup | శ్రీలంక (Srilanka) వేదికగా జరుగుతున్న ఎసీసీ ఎమర్జింగ్ ఆసియాకప్ (ACC Emerging Teams Asia Cup) లో యువ భారత జట్టు (India-A) ఫైనల్‌కు చేరింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో (Semi final) యంగ్‌ఇండియా 51 పరుగుల తేడాతో బంగ్లాదేశ్-‘ఎ’ (Bangladesh-A) ను చిత్తుచేసింది. దీంతో ఇండియా-ఎ జట్టు ఫైనల్ (India Final Entry) లోకి ప్రవేశించింది.
ఈ మ్యాచ్‌లో భాగంగా ఇండియా-ఎ, బంగ్లాదేశ్-ఎ ఆటగాళ్ల మధ్య గొడవ జరిగింది. ఇండియా-ఎ బౌలర్ యువరాజ్ సిన్హ్ దోడియా బౌలింగులో నికిన్ జోస్‌కు క్యాచ్ ఇచ్చి బంగ్లా బ్యాటర్ సౌమ్య సర్కార్ అవుటయ్యాడు. దీంతో భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో సౌమ్య సర్కార్‌కు.. హర్షిత్ రాణాకు మధ్య గొడవ మొదలైంది. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి మైదానంలో ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో అంపైర్, ఇతర ఆటగాళ్లు కలుగ చేసుకుని గొడవను సద్దుమణిగిపించారు. ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
అంతకుముందు యష్ ధుల్ (Yash Dhul) కెప్టెన్ (66) ఇన్నింగ్స్‌తో జట్టును ముందుకు నడపడంతో ఎమర్జింగ్ ఆసియాకప్‌లో యువ భారత జట్టు ఫైనల్‌కు చేరింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో యంగ్‌ఇండియా 51 పరుగుల తేడాతో బంగ్లాదేశ్-‘ఎ’ను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్-‘ఎ’ 49.1 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ను 34.2 ఓవర్లలో 160 పరుగులకు భారత జట్టు ఆలౌట్ చేసింది. ఇక ఆదివారం కొలంబోలో జరుగనున్న ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో భారత్ ఫైనల్లో తలపడనుంది.
Heated argument between Harshit Rana and Soumya Sarkar.
Ind A Vs Ban A#AsiaCup #INDvsBAN #Ashes pic.twitter.com/Q9IsyqCwXq
— Cricfreak (@crickfreak95) July 21, 2023
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

