హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరస్టైన డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డిని ఏసీబీ అధికారులు రెండు రోజుల కస్టడీలోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. చంచల్‌గూడ జైలు నుంచి గురువారం ఉదయం కస్టడీలోకి తీసుకున్న అధికారులు.. వైద్య పరీక్షల అనంతరం బంజారాహిల్స్‌లోని ఏసీబీ హెడ్ క్వార్టర్స్‌కు తరలించారు. తొలిరోజు ఏసీబీ అధికారులు భీమ్‌రెడ్డి బినా మీ ఆస్తులపై ఆరా తీసినట్టు సమాచా రం. ఏసీబీ దర్యాప్తులో బినామీ ఆస్తుల వ్యవహారంలో కొన్నిపేర్లు ఇప్పటికే తెరపైకి వచ్చాయి.
అధికారులు వాటిపైనే ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది. ఇప్పటికే జరిగిన సోదాల్లో 10 బ్యాంకు ఖాతాలు, రెండు లాకర్లను సీజ్ చేశారు. వీటిలో జరిగిన లావాదేవీలు, డిపాజిట్లు, నగదు బదిలీలు, ఆస్తుల కొనుగోళ్లతో ఉన్న సంబంధాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఏసీబీ అధికారుల ప్రశ్నలకు భీమ్‌రెడ్డి ముక్తసరిగా సమాధానాలు ఇస్తున్నట్టు సమాచారం.