నారాయణపేట, సెప్టెంబర్ 8 : నారాయణపేట సబ్‌రిజిస్ట్రార్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గ్రేడ్-2 సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న లగిశెట్టి వెంకటస్వామి ఓ ఇంటి రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఫిర్యాదుదారుడి నుంచి జూలై 18న రూ.90 వేల లంచం డిమాండ్ చేశాడు.
ఈ మేరకు రూ.50 వేల మొత్తాన్ని జూలై 21న హోటల్ యజమాని కమ్మరి నగేశ్ ద్వారా చెల్లించాడు. మిగిలిన రూ.40 వేల కోసం సబ్ రిజిస్ట్రార్ డిమాండ్ చేయడంతో ఇంటి యజమాని ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఈ మేరకు ఏసీబీ అధికారులు పేట కార్యాలయంలో మంగళవారం విచారణ చేపట్టారు. వెంకటస్వామితోపాటు నగేశ్‌ను హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రత్యేక కోర్టుకు తరలించారు.