న్యూఢిల్లీ: ఆక్రమిత్ వెస్ట్ బ్యాంక్‌లోని ఇజ్రాయెల్ సెటిల్మెంట్ల నుంచి వచ్చే వస్తువులపై బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు విధించాయి. దీనిపై ఇజ్రాయెల్ వెంటనే స్పందించింది. జెరూసలేంలోని కాన్సులేట్‌ను మూసివేయడంతో పాటు బ్రిటిష్ అధికారులపై అదనపు చర్యలను చేపట్టే ప్రణాళికను ప్రకటించింది.
ఐక్యరాజ్యసమితి, చాలా దేశాలు వెస్ట్ బ్యాంక్‌లోని ఇజ్రాయెల్ సెటిల్మెంట్లను చట్టవిరుద్ధమైనవిగా పరిగణిస్తున్నాయి.