e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home News Huzurabad | ఈట‌ల సిద్ధాంతాలు లేని వ్య‌క్తి..:ఏబీవీపీ మాజీ జిల్లా కన్వీనర్ ఆవుల తిరుపతి

Huzurabad | ఈట‌ల సిద్ధాంతాలు లేని వ్య‌క్తి..:ఏబీవీపీ మాజీ జిల్లా కన్వీనర్ ఆవుల తిరుపతి

హుజూరాబాద్‌: మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ సిద్దాంతాలు లేని వ్య‌క్తి అని ఏబీవీపీ మాజీ జిల్లా క‌న్వీన‌ర్ ఆవుల తిరుప‌తి మండిప‌డ్డారు. హుజూరాబాద్ మండలం సింగాపురంలో ఆదివారం ఆయ‌న మంత్రి హ‌రీశ్‌రావు స‌మ‌క్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తిరుప‌తికి హ‌రీశ్‌రావు గులాబీ కండువా క‌ప్పి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా తిరుప‌తి విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ..ఈట‌ల రాజేంద‌ర్‌ త‌న‌పై అనేక‌సార్లు అక్ర‌మ కేసులు పెట్టి, అరెస్టు చేయించార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఈట‌ల రాజేంద‌ర్‌కు నైతిక‌త లేద‌న్నారు. ఆయ‌న స్వార్థం కోస‌మే బీజేపీలో చేరార‌ని ఆరోపించారు. ఈట‌ల నాయ‌క‌త్వంలో ప‌నిచేయడం ఇష్టంలేక టీఆర్ఎస్‌లో చేరుతున్న‌ట్లు చెప్పారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింద‌ని ఆవుల తిరుప‌తి పేర్కొన్నారు. టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధికి ఆక‌ర్షితుడినై పార్టీలో చేరుతున్నాన‌ని స్ప‌ష్టం చేశారు. ఈట‌ల రాజేంద‌ర్ దేవాల‌య భూములు క‌బ్జా చేసిన ద‌గాకోరు అని మండిప‌డ్డారు. అలాంటి వ్య‌క్తిని పార్టీలో చేర్చుకున్నందుకు బీజేపీ నాయ‌కులు సిగ్గుప‌డాల‌న్నారు. తెలంగాణ ఉద్య‌మంలో విద్యార్థి నాయ‌కుడిగా పోరాడిన గెల్లు శ్రీనివాస్‌యాద‌వ్‌కు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వ‌డం గొప్ప విష‌య‌మ‌ని అభివ‌ర్ణించారు. తెలంగాణ కోసం నెల‌ల‌పాటు జైళ్లో ఉన్న అస‌లైన ఉద్య‌మ నాయ‌కుడు గెల్లు శ్రీనివాస్‌యాద‌వ్ గెలుపుకోసం త‌న శాయ‌శ‌క్తులా కృషిచేస్తాన‌ని తిరుప‌తి పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement