ములుగు, సెప్టెంబర్ 20 (నమస్తేతెలంగాణ): మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్స్‌లు లేకపోవడం అమానుషమని, ఇది నేరపూరిత నిర్లక్ష్యమని కాంగ్రెస్ ప్రభుత్వ తీ రును కేటీఆర్ ఎక్స్ వేదికగా ఎండగట్టారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఆకులవారి ఘనపురం గ్రామానికి చెందిన కంకణాల శ్రీకాంత్ కుమార్తె గీతిక(6) జ్వరం తో బాధపడుతూ వరంగల్‌లోని ఎంజీఎంలో గురువారం మృతి చెందింది. పాప మృతదేహాన్ని ఇంటికి తేవడానికి ప్రభుత్వ వాహనం అందుబాటులో లేకపోవడంతో బీఆర్ఎస్ నేత భూక్యా జంపన్న సొంత ఖర్చులతో ప్రై వేటు అంబులెన్స్‌ను సమకూర్చారు. విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకు న్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా చిన్నారి మృతిపై సంతాపం వ్య క్తం చేసి మృతదేహాన్ని తరలించే స్థితిలో లేని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఘటన అవమానకరమని పేర్కొన్నారు. జీవితంలో ఉన్న పరువు చావు లో లేదని, ఇదే సీఎం రేవంత్‌రెడ్డి వైద్యం అని, ఇది ఎవరికి అర్హత లేని నేరపూరిత నిర్ల క్ష్యం అంటూ కేటీఆర్ పోస్టులో పేర్కొన్నారు.