భారత్-‘ఎ’ 308/4
బ్లూమ్ఫాంటైన్: టాపార్డర్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ (103; 16 ఫోర్లు) సెంచరీతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికా-‘ఎ’తో జరుగుతున్న నాలుగు రోజుల అనధికారిక టెస్టులో భారత్-‘ఎ’ మెరుగైన స్థితిలో నిలిచింది. అభిమన్యుతో పాటు కెప్టెన్ ప్రియాంక్ (96) రాణించడంతో గురువారం మూడో రోజు ఆట నిలిచే సమయానికి భారత్-‘ఎ’ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. న్యూజిలాండ్తో సిరీస్కు భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన తెలుగు ఆటగాడు హనుమ విహారి (25) పెద్దగా ప్రభావం చూపలేదు. నేడు ఆటకు చివరి రోజు కాగా.. చేతిలో ఆరు వికెట్లు ఉన్న మన జట్టు.. ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 201 పరుగులు వెనుకబడి ఉంది. బాబా అపరజిత్ (19), ఉపేంద్ర యాదవ్ (5) క్రీజులో ఉన్నారు. అంతకుముందు దక్షిణాఫ్రికా-‘ఎ’ 509/7 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే.