న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ 2022-23 బడ్జెట్ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కోవిడ్-19 ప్రభావం నుంచి ఢిల్లీ ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటున్నట్లు ఆయన చెప్పారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 75,800 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 2021-22 సంవత్సరంలో 69వేల కోట్ల బడ్జెట్ను కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి బడ్జెట్ను 9.86 శాతం పెంచినట్లు మంత్రి వెల్లడించారు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం వరుసగా ఎనిమిదో ఏడాది రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది రోజ్గార్ బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లు సిసోడియా తెలిపారు. ఢిల్లీలో తలసరి ఆదాయం 2.7 శాతంగా ఉందని, ఇది జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉందన్నారు. రోజ్గార్ బడ్జెట్తో రానున్న అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు.