7 లక్షల కోట్ల సంపద ఆవిరి.. ఒక్క శాతానికి పైగా నష్టపోయిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలతో సూచీలు ఒక్క శాతానికి పైగా పతనం చెందాయి. మెటల్, ఐటీ, కమోడిటీ సూచీల్లో అమ్మకాలు పోటెత్తడంతోపాటు ఐటీ రంగ షేర్లు వరుసగా నాలుగో రోజు కూడా దిగువముఖం పట్టాయి.
- సెన్సెక్స్ 1,048, నిఫ్టీ 336 పాయింట్ల పతనం
ముంబై, ఫిబ్రవరి 13 : దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలతో సూచీలు ఒక్క శాతానికి పైగా పతనం చెందాయి. మెటల్, ఐటీ, కమోడిటీ సూచీల్లో అమ్మకాలు పోటెత్తడంతోపాటు ఐటీ రంగ షేర్లు వరుసగా నాలుగో రోజు కూడా దిగువముఖం పట్టాయి. నష్టాల్లో ప్రారంభమైన సూచీలకు గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు నష్టాలకు ఆజ్యంపోశాయి. ఇంట్రాడేలో 1,140 పాయింట్లు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 1,048.16 పాయింట్లు లేదా 1.25 శాతం పతనం చెందింది. చివరకు వారాంతం ముగిసే సమయానికి సూచీ 82,626.76 పాయింట్ల వద్ద ముగిసింది.
మరోసూచీ నిఫ్టీ కూడా కీలక మైలురాయిని కోల్పోయింది. 336.10 పాయింట్లు లేదా 1.30 శాతం తగ్గి 25,471.10 వద్ద స్థిరపడింది. దీంతో మదుపరులు రూ.7 లక్షల కోట్లకు పైగా సంపదను కోల్పోయారు. బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,02,017.71 కోట్లు కరిగిపోయి రూ.4,65,46,643.20 కోట్లు లేదా 5.13 ట్రిలియన్ డాలర్లుకు జారుకున్నది. గడిచిన రెండు సెషన్లలో మదుపరులు రూ.9.52 లక్షల కోట్ల సంపదను కోల్పోయినట్టు అయింది. కార్పొరేట్ల నిరుత్సాహక ఫలితాలు, ఏఐ అంతరాయంతో టెక్నాలజీ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడిలో కొనసాగుతున్నాయని వెల్త్ మేనేజ్మెంట్ రీసర్చ్ హెడ్ సిద్ధార్థ తెలిపారు. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 10 నెలల కనిష్ఠ స్థాయికి జారుకున్నదన్నారు.
- హెచ్‌యూఎల్, ఎటర్నల్ షేర్లు నాలుగు శాతానికి పైగా పతనం చెంది టాప్ లూజర్లుగా నిలిచాయి.
- వీటితోపాటు టాటాస్టీల్, టైటాన్, టీసీఎస్, పవర్‌గ్రిడ్, రిలయన్స్ షేర్లు రెండు శాతానికి పైగా కోల్పోయాయి.
- అలాగే బీఈఎల్, ఏషియన్ పెయింట్స్, మహీంద్రాఅండ్‌మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, ఐటీసీ, కొటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండిగో షేర్లు ఒక్క శాతానికి పైగా నష్టపోయాయి.
- సన్‌ఫార్మా, ట్రెంట్, మారుతి, బజాజ్‌ఫిన్‌సర్వ్, భారతీ ఎయిర్టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, ఎల్అండ్టీ, టెక్ మహీంద్రా షేర్లు పతనం చెందాయి.
- కానీ బజాజ్‌ఫైనాన్స్, ఎస్బీఐ షేర్లు మాత్రమే లాభపడ్డాయి.
- ఈవారంలో సెన్సెక్స్ 953.64 పాయింట్లు లేదా 1.14 శాతం, ఎన్ఎస్ఈ నిఫ్టీ 222.6 పాయింట్లు పతనం చెందాయి.
- రంగాలవారీగా మెటల్ సూచీ అత్యధికంగా 3.21 శాతం పతనం చెందింది. దీంతోపాటు రియల్టీ, కమోడిటీస్ సూచీ 2.27 శాతం చొప్పున జారుకున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

