Drive | తెలుగు, తమిళ భాషల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న యాక్టర్లలో ఒకడు ఆదిపినిశెట్టి. ఓ వైపు హీరోగా, మరోవైపు విలన్‌గా రెండు ట్రాక్‌లపై జర్నీ సాగిస్తున్న అతికొద్ది యువనటుల్లో టాప్‌లో ఉంటాడు. ఆదిపినిశెట్టి లీడ్ రోల్లో నటించిన చిత్రం డ్రైవ్ (Drive). 2025 డిసెంబర్లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. రివేంజ్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ చిత్రం రీసెంట్గా పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైం వీడియోలోకి కూడా వచ్చేసింది.
తాజాగా మరింత మంది మూవీ లవర్స్‌కు రీచ్ అయ్యేలా మరో ప్లాట్‌ఫాంలోకి కూడా వచ్చేసింది. డ్రైవ్ పాపులర్ తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం ఆహాలో జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో మడొన్నా సెబాస్టియన్, సత్యదేవ్, రాజా చెంబోలు, కమల్ కామరాజు, అనీష్ యోహాన్ కురువిల్ల ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని జెన్యూస్ మహ్మద్ డైరెక్ట్ చేయగా.. భవ్యక్రియేషన్స్పై తెరకెక్కించారు.
Every secret has a price.
And someone is always watching👀@AadhiOfficial @MadonnaSebast14 @RajaChembolu @kamalkamaraju @anishkuruvilla @jenusemohamed @AbinandhanR @osho_venkat @PrawinPudi #AnandaPrasad @BhavyaCreations pic.twitter.com/GFARaOuO0S— ahavideoin (@ahavideoIN) January 27, 2026