Gandhi Talks | విజయ్ సేతుపతి ‘గాంధీ టాక్స్’ ట్రైలర్ రిలీజ్
Gandhi Talks | కమల్ హాసన్ ‘పుష్పక విమానం’ మూకీ సినిమా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏ విధంగా మంత్రముగ్ధులను చేసిందో మనందరికీ తెలిసిందే.
Gandhi Talks | కమల్ హాసన్ ‘పుష్పక విమానం’ మూకీ సినిమా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏ విధంగా మంత్రముగ్ధులను చేసిందో మనందరికీ తెలిసిందే. అయితే మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అదే స్థాయిలో భావోద్వేగాలను పండించడానికి ‘గాంధీ టాక్స్’ (Gandhi Talks) అనే మూకీ డ్రామా సిద్ధమైంది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు. ఈ సినిమాలో మాటలు లేకపోయినా, కేవలం నటీనటుల హావభావాలు మరియు సంగీతంతోనే కథను ప్రేక్షకుల హృదయాలకు చేరువ చేసేలా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఈ చిత్రం జనవరి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది.
ఇది మూకీ సినిమా అయినప్పటికీ.. తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ మరియు మలయాళ భాషల్లో టైటిల్ కార్డులు, ప్రమోషన్లతో గ్రాండ్‌గా విడుదల కానుంది. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామిలతో పాటు అందాల నటి అదితి రావు హైదరి, మరాఠీ నటుడు సిద్ధార్థ్ జాదవ్ కీలక పాత్రల్లో నటించారు. మాటలు లేని ఈ సినిమాలో సంగీతమే ప్రాణం. అందుకే ఈ చిత్రానికి ఆస్కార్ విజేత, మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ అద్భుతమైన స్వరాలను అందిస్తున్నాడు. కిషోర్ పి. బేలేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఉమేష్ కుమార్ బన్సల్, రాజేష్ కేజ్రీవాల్, మీరా చోప్రా, కిషోర్ పాండురంగ్ బేలేకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

