Hyderabad | సైరన్ మోగడంతో ట్రాఫిక్ క్లియర్ చేసిన పోలీసులు.. సిగ్నల్ దాటాక అంబులెన్స్ ఆపి బజ్జీలు కొన్న డ్రైవర్
Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ఓ అంబులెన్స్ డ్రైవర్ వ్యవహరించిన తీరు ట్రాఫిక్ పోలీసులతో పాటు స్థానికులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. నారాయణగూడలో ఓ అంబులెన్స్ డ్రైవర్ అత్యవసర సైరన్ మోగించాడు. సిగ్నల్ దాటిన తర్వాత అంబులెన్స్ ఆపి కూల్ డ్రింక్ కొనుగోలు చేశాడు.
Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ఓ అంబులెన్స్ డ్రైవర్ వ్యవహరించిన తీరు ట్రాఫిక్ పోలీసులతో పాటు స్థానికులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. నారాయణగూడలో ఓ అంబులెన్స్ డ్రైవర్ అత్యవసర సైరన్ మోగించాడు. దీంతో అంబులెన్స్‌లో రోగి ఉండొచ్చని భావించిన ట్రాఫిక్ పోలీసులు.. సిగ్నల్‌ను క్లియర్ చేశారు. సిగ్నల్ దాటిన అంబులెన్స్.. కాస్త ముందుకెళ్లి రోడ్డు పక్కకు ఆగింది. అంబులెన్స్ డ్రైవర్ కిందకు దిగి, కూల్ డ్రింక్ కొనుగోలు చేశారు. అందులో ఉన్న ఓ ఇద్దరు నర్సులు కూడా పక్కనే ఉన్న ఫుడ్ సెంటర్‌కు వెళ్లి బజ్జీలు, ఇతర ఆహార పదార్థాలు కొనుగోలు చేశారు.
ఈ విషయాన్ని గమనించిన పోలీసు కానిస్టేబుల్ వెంటనే వాహనం దగ్గరకు వచ్చి అంబులెన్స్‌లో రోగి లేరని నిర్ధారించుకున్న తర్వాత, డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్‌లో రోగి ఎవరైనా ఉన్నారేమో అనుకొని, ట్రాఫిక్ క్లియర్ చేశానని, కూల్ డ్రింక్, బజ్జీల కోసం సైరన్ ఎందుకు మోగించావంటూ డ్రైవర్‌ను ప్రశ్నించారు. అయితే అందులో రోగి ఉన్నాడని నమ్మించేందుకు డ్రైవర్ యత్నించాడు. ఈ దృశ్యాలను చిత్రీకరించిన కానిస్టేబుల్.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
ఈ వీడియోను రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ ట్వీట్ చేశారు. అత్యవసర సమయాల్లో ఉపయోగించే సైరన్‌ను దుర్వినియోగం చేయొద్దంటూ అంబులెన్స్ డ్రైవర్లకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లోనే సైరన్ మోగించాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని డీజీపీ హెచ్చరించారు.
#TelanganaPolice urges responsible use of ambulance services, citing misuse of sirens. Genuine emergencies require activating sirens for swift and safe passage. Strict action against abusers is advised.
Together, we can enhance emergency response and community safety. pic.twitter.com/TuRkMeQ3zN
— Anjani Kumar IPS (@Anjanikumar_IPS) July 11, 2023
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

