లండన్ : లండన్(London)లోని ఈస్ట్ హ్యాంరాయల్ రీజేన్స్ హాల్లో నిర్వహించిన తెలుగు(Telugu) సినీ సంగీత విభావరి(Sangeeta Vibhavari) అక్కడి తెలుగు ప్రేక్షకులను అలరించాయి. డీవీకే గేట్వేస్ సంస్థ(DVK Gateway) ఆధ్వర్యంలో ప్రముఖ గాయనీ గాయకులు(Singers) మనో(Mano), కార్తీక్(Karthik), కల్పన(Kalpana) , గోపిక పూర్ణిమ, అనురాధ శ్రీరాం తదితరులు పాడిన పాటలకు ప్రేక్షకులు ముగ్ధులయ్యారని నిర్వాహకురాలు లావణ్య కావూరి తెలిపారు.
ఈ సంగీత విభావరి కార్యక్రమానికి పన్నెండు వందలమందికి పైగా ప్రవాస తెలుగు ప్రజలు హాజరయ్యారని వివరించారు. ఈ సందర్భంగా గాయనీ, గాయకులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. లండన్ లో పుట్టి పెరిగిన అమ్మాయి చిన్మయీ తడకమల్ల తన మాటలతో ప్రేక్షకులందరినీ ఆలరించింది.
ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం కావడానికి సహకరించిన వినోద్ దొప్పలపూడి, సురేంద్ర శ్రీనివాస్ రెడ్డి పింగళి, సురేందర్ రెడ్డి, శ్రవణ్ కుమార్ గౌడ్ బైరు, వంశీ , హరీష్, భరత్ లను డీవీకే గేట్వేస్ సంస్థ యాజమానురాలు లావణ్య కావురి , వినోద్ సన్మానించారు.