న్యూఢిల్లీ : రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలుపకుండా తనవద్దే ఏండ్లుగా అట్టిపెట్టుకుంటున్న తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘ఆయన తన సొంత విధానాన్ని అవలంబిస్తున్నట్టు కనపడుతున్నది’ అని వ్యాఖ్యానించింది. స్టాలిన్ సర్కార్ వర్సెస్ తమిళనాడు గవర్నర్ కేసుపై గురువారం కోర్టు విచారణ జరిపింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలుపకుండా తనవద్దే అట్టిపెట్టుకోవటం రాజ్యాంగంలోని ఆర్టికల్-200ను నీరుగార్చడమేనని ధర్మాసనం అభిప్రాయపడింది. తదుపరి విచారణ శుక్రవారం నాటికి వాయిదా వేసింది.