
ఘట్కేసర్, నవంబర్ 19 : కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని పోచారం మున్సిపాలిటీ కమిషనర్ ఎ.సురేశ్ తెలిపారు. ప్రపంచ టాయిలెట్ డే సందర్భంగా పారిశుధ్య కార్మికులను శుక్రవారం సన్మానించారు. మున్సిపాలిటీ పరిధిలోని నారపల్లి, అన్నోజిగూడ, ఎన్టీపీసీ చౌరస్తా, యంనంపేట్లోని నాలుగు ప్రధాన కూడలి ప్రాంతాల్లో పురుషులు, మహిళలకు వేర్వేరుగా మరుగుదొడ్లను ఏర్పాటు చేశామని తెలిపారు.అనంతరం మున్సిపాలిటీ ధ్రువీకరణ పత్రంతో పాటు, రూ.500 నగదు బహుమతిని కమిషనర్ సురేశ్ నలుగురు కార్మికులకు అందజేసి, సన్మానించారు. మేనేజర్ నర్సింహులు, కార్యాలయ సిబ్బంది రాఘవేందర్, రాజు, సంతోష్, నర్సింహా రెడ్డి, శానిటేషన్ సూపర్వైజర్లు, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.
పారిశుధ్యానికి ప్రాధాన్యత..
మేడ్చల్ : పట్టణ ప్రజలు పారిశుధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్ దీపికా నర్సింహా రెడ్డి అన్నారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో వరల్డ్ టాయిలెట్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులను సన్మానించి, ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ రమేశ్, శానిటరీ ఇన్స్పెక్టర్ రాంచందర్, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ అఖిల్కుమార్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
పరిశుభ్రత పాటించాలి : కమిషనర్
జవహర్నగర్ : ప్రతి ఒక్కరూ పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, మరుగుదొడ్డిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని జవహర్నగర్ కమిషనర్ జ్యోతిరెడ్డి తెలిపారు. శుక్రవారం కార్పొరేషన్ పరిధిలో వరల్డ్ టాయిలెట్ దినం సందర్భంగా ఉత్తమ పారిశుధ్య కార్మికులు మారమ్మ, విష్ణుమూర్తిలను సన్మానించి, సర్టిఫికెట్ను ప్రదానం చేశారు. డీఈఈ చెన్నకేశవులు, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ సందీప్ పాల్గొన్నారు.