ఉప్పల్, ఫిబ్రవరి 4: వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం చిలుకానగర్ డివిజన్లోని సీతారామకాలనీలో వరదనీటి కాల్వ పనులను ఎమ్మెల్యే, కార్పొరేటర్ గీతాప్రవీణ్ ముదిరాజ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీల సమగ్రాభివృద్ధికి నిధులు తీసుకొస్తున్నామని, ప్రణాళికాయుతంగా పనులు పూర్తి చేస్తున్నామని అన్నారు. అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. వరదనీటి సమస్యలు లేకుండా తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కాలనీల్లో ముంపు సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే సహకారంతో డివిజన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ తెలిపారు. కార్యక్రమంలో ఈఈ నాగేందర్, ఏఈ రాజ్‌కుమార్, నేతలు జనుంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, జల్లి మోహన్, ఏదుల కొండల్‌రెడ్డి, వీబీ.నర్సింహ, జగన్, శేఖర్, మహేందర్, విఠల్, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.