AP News | ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. రైలులో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. కత్తితో బెదిరించి సెల్ఫోన్, డబ్బులు దోచుకోవడమే కాకుండా.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ వచ్చేందుకు ఏపీలోని రాజమహేంద్రవరంలో సంత్రగచి స్పెషల్ ట్రైన్లో ఓ మహిళ ఎక్కింది. గుంటూరు చేరుకునే సమయానికి ఆమె ప్రయాణిస్తున్న బోగీ పూర్తిగా ఖాళీ అయిపోయింది. మహిళ ఒంటరిగా ఉన్న సంగతిని ఓ 40 ఏళ్ల వ్యక్తి గమనించాడు. ఇదే అదునుగా ఆమె దగ్గరకు వెళ్లిన అతను.. కత్తితో బెదిరించి ఆమె హ్యాండ్బ్యాగ్, సెల్ఫోన్, డబ్బులను లాక్కున్నాడు. అంతటితో ఆగకుండా రన్నింగ్ ట్రైన్లోనే ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం రైలు పెదకూరపాడు రైల్వే స్టేషన్ వద్ద ఆగగానే పారిపోయాడు. చర్లపల్లి చేరుకున్నాక బాధితురాలు జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని.. ఏపీలోని నడికుడి పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు.