భువనగిరి అర్బన్, మార్చి 27: కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నదని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీని ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఎంవీఎస్ శర్మ రచించిన ‘అమ్మకానికి ప్రజల నమ్మకం’ పుస్తకాన్ని ఆదివారం ఆయన హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆస్తులను ఆదాని, అంబానీలకు కట్టబెట్టాలని చూస్తున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న చట్టాలతో సామాన్య ప్రజలపై భారం పడుతున్నదన్నారు. రైతులు పండించిన వరి ధాన్యం కొనకుండా ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్నదని విమర్శించారు. కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం కార్యదర్శి మర్రి శ్రీధర్‌రెడ్డి, రాయలి శ్రీనివాస్, కే.వేణుగోపాల్ పాల్గొన్నారు.
బీబీనగర్ : పట్టణంలోని దుర్గామాత ఆలయంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి దంపతులు ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గోలి ప్రణీత, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోలి పింగళ్‌రెడ్డి, సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మీశ్రీనివాస్, ఉప సర్పంచ్ దస్తగిరి, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు నారగోని మహేశ్, యువజన విభాగం మండలాధ్యక్షుడు ఎలుగల నరేందర్, నాయకులు సత్యనారాయణ, గణేశ్, చంద్రశేఖర్, రమేశ్ పాల్గొన్నారు.