తాండూర్ : ట్రిపుల్ ఐటీలో సీటు (Triple IT) సాధించిన మండలంలోని అచ్చలాపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు పుప్పాల పూజిత (Puppla Pujita) , సముద్రాల జస్వంత్(Samudrala Jaswanth) ను పాఠశాల ఉపాధ్యాయులు సోమవారం సన్మానించారు. పాఠశాలలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. 2024- 2025 సంవత్సరం పదవ తరగతి ఫలితాలలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థిని పుప్పాల పూజితకు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు కే శ్రీనివాస్ రూ. 10వేల ప్రైజ్మనీ అందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు పీ ఉమాదేవి, సన్మాన గ్రహీతలు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.