మునుగోడు జనవరి 18 : నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1999-2000వ సంవత్సరంలో పదో తరగతి విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు ఆదివారం 25 ఏళ్ల అనంతరం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. అందరూ ఒకే వేదికలో కలుసుకొని పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు మాట్లాడుతూ మేము విద్య బుద్ధులు నేర్పిన విద్యార్థిని విద్యార్థులు ఈరోజు వారి వారి వృత్తులలో సమాజ సేవలో ప్రభుత్వ ఉద్యోగాలలో ఉండడం చాలా గర్వంగా ఉందన్నారు. అదేవిధంగా సమాజంలో ప్రజాసేవకులు గా కూడా ఎదగడం ఎంతో ఆనందదాయకం అన్నారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులకు శాలువాతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అదేవిధంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవాలని తీర్మానించారు.