జగిత్యాల : జిల్లాలోని కోరుట్ల పట్టణం మెట్పల్లి రోడ్డులో గల ఎలక్ట్రిక్ బైక్ షో రూమ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బందితో పాటు స్థానిక యువకులు అక్కడకు చేరుకుని మంటలను అదపు చేశారు. మంటల్లో కాలిపోతున్న బైక్లను బయటకు తీసుకొచ్చారు.
కాగా, ఈ ఘటనలో భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ గా తెలుస్తున్నది. సకాలంలో స్పందించి మంటలను ఆర్పిన యువకులను కోరుట్ల ఎస్సై చిర్ర సతీశ్ అభినందించారు.