నర్సంపేట, మార్చి 4: నర్సంపేట డివిజన్ ప్రజల జిల్లాస్థాయి వైద్యశాల చిరకాల స్వప్నం త్వరలోనే నెరవేరనుందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డివిజన్లోని పేదలకు కార్పొరేట్‌స్థాయి వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నర్సంపేటకు జిల్లాస్థాయి వైద్యశాలను మంజూరు చేశారన్నారు. 250 పడకల దవాఖాన ఏర్పాటుకు ప్రభుత్వం రూ. 66 కోట్లు మంజూరు చేసిందన్నారు. నియోజకవర్గంలో 59 హెల్త్ సబ్‌సెంటర్లు అందుబాటలో ఉన్నాయన్నారు. రూ. 4.50 కోట్ల నిధులతో వాటికి భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. శనివారం మంత్రి హరీశ్‌రావు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామి, నాయకులు మునిగాల వెంకట్‌రెడ్డి, డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, రాయిడి రవీందర్‌రెడ్డి, నల్లా మనోహర్‌రెడ్డి, నాగెల్లి వెంకటనారాయణగౌడ్, మురాల మోహన్‌రెడ్డి, దార్ల రమాదేవి, కే శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
చెన్నారావుపేట/నర్సంపేటరూరల్: రాష్ట్రంలో అంతర్గత రహదారుల అభివృద్ధికి టీఆర్ఎస్ సర్కారు పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని ఖాదర్‌పేటలో రూ. 30 లక్షల నిధులతో 690 మీటర్ల సీసీరోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. చెన్నారావుపేటలోని శ్మశానవాటిక నుంచి మున్నేరువాగు మీదుగా కొత్తూరు రంగాపురం వెళ్లే రహదారికి మరమ్మతులు చేయించాలని కోరుతూ రైతులు, గీత కార్మికులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బదావత్ విజేందర్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు బానోత్ పత్తినాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాల్నె వెంకన్నగౌడ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ, ఖాదర్‌పేట సర్పంచ్ అనుముల కుమారస్వామి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కుండె మల్లయ్య, అమీనాబాద్ సొసైటీ చైర్మన్ మరహరి రవి తదితరులు పాల్గొన్నారు. నర్సంపేట మండలంలోని కమ్మపల్లికి చెందిన సాంబరాతి ముత్తయ్య ఇటీవల మృతి చెందగా, ఎమ్మెల్యే పెద్ది బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మిట్టగడపల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి చిలువేరు శ్రీనివాస్, ఉప సర్పంచ్ తిరుపతి, నాయకులు ఉన్నారు.
నర్సంపేట/నర్సంపేటరూరల్: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. నర్సంపేటలోని కస్తూరిబాయి మహిళా మండలి నర్సంపేట ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళలకు నిర్వహించే ఆటలపోటీల్లో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, కస్తూరీబాయి మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ చామర్తి ఉషారాణి, మున్సిపల్ చైర్మన్ గుంటి రజినీకిషన్, డీడబ్ల్యూ శారద, ఎంపీపీ మోతె కళావతి, గుడిపూడి అరుణ, నల్ల భారతి, వినోద తదితరులు పాల్గొన్నారు. అలాగే, మార్క్‌ఫెడ్ డైరెక్టర్‌గా ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామరామస్వామీనాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులను పెద్ది సుదర్శన్‌రెడ్డి చేతులమీదుగా ఆయన అందుకున్నారు. నర్సంపేట మండల ఆదర్శ సమాఖ్య జాతీయస్థాయి అవార్డుకు ఎంపికైన సందర్భంగా సమాఖ్య కార్యవర్గ సభ్యులు ఏపీఎం కుందేళ్ల మహేందర్ ఆధ్వర్యంలో పెద్దిని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని అభినందించారు. కార్యక్రమంలో ఆదర్శ మండల సమాఖ్య అధ్యక్షురాలు మోటూరి స్వేత, కార్యదర్శి రజియా, కోశాధికారి శ్రీదేవి, కౌన్సిలర్ దార్ల రమాదేవి పాల్గొన్నారు.