కోల్కతా: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమబెంగాల్లో పార్టీల మధ్య పరస్పర దాడులు, రాజకీయ హత్యలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బెంగాల్లోని కూచ్బెహార్ జిల్లాలో ఒక మండలానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్న బీజేపీ నేత అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. దిన్హట పట్టణంలోని పార్టీ కార్యాలయానికి సమీపంలో బుధవారం ఉదయం ఆయన మృతదేహం లభ్యమైంది.
అయితే, బీజేపీ నేతది హత్యనా..? లేక సాధారణ మరణమా అనే విషయంలో క్లారిటీ లేకపోవడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. కానీ బీజేపీ నేతలు మాత్రం ఇది ముమ్మాటికీ హత్యేనని చెబుతున్నారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పక్కా ప్లాన్ ప్రకారం ఈ హత్య చేయించిందని ఆరోపిస్తున్నారు. హత్యలకు భయపడి తాము ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఇంట్లో కూర్చుంటామని తృణమూల్ కాంగ్రెస్ భావిస్తున్నదని వారు విమర్శిస్తున్నారు.
Coochbehar: A Bharatiya Janata Party (BJP) Mandal President was found dead near party office in Dinhata, earlier today.
— ANI (@ANI) March 24, 2021
"It's a pre-planned murder. They (TMC) want us (BJP workers) to just sit at home out of fear but we will continue our fight," says a BJP worker. #WestBengal pic.twitter.com/wo6tsc5K1h