Uttar Pradesh | ముజఫర్ నగర్, సెప్టెంబర్ 30: ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్లో 200 ఏండ్లు గల పెద్ద చెట్టుకు మనుషుల మాదిరి శుక్రవారం అంత్యక్రియలు జరిగాయి. బుధవారం ఈ చెట్టు నేల కూలింది. అనాథశవాలకు అంత్యక్రియలు నిర్వహించే శాలు సైని(37) ఈ చెట్టుకు అంత్యక్రియలు నిర్వహించారు.
ఆమె మొదటిసారి ఇలా ఒక చెట్టుకు అంత్యక్రియలు నిర్వహించారు. హిందూ మత సంప్రదాయం ప్రకారం చెట్టులోని కొన్ని భాగాలకు ఆమె దహన సంస్కారాలు నిర్వహించారు. ‘ముక్తి’ లభించడంలో చెట్టుకు సాయపడమని తన అంతరంగం తనకు చెప్పిందని సైని అన్నా రు. ఆ చెట్టును మొదటిసారి శుక్రవారమే చూశానని.. కుటుంబంలో పెద్దవారిని కోల్పోయినట్టు అనిపించిందని తెలిపారు.