హైదరాబాద్, మే15 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ గురుకుల సొసైటీ(టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలోని సైనిక్, ఒకేషనల్, సీఈవో (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్), నాన్ సీఈవోల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు శుక్రవారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది.
పరీక్షకు మొత్తం 45,357 మంది దరఖాస్తు చేసుకోగా, 39,400 మంది విద్యార్థులు(86.87శాతం) హాజరైనట్టు సొసైటీ కార్యదర్శి శారద శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇంటర్‌కు సంబంధించి 231 గురుకులాల్లో 19,860 సీట్లు అందుబాటులో ఉన్నాయని, మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించనున్నట్టు తెలిపారు.