హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని మాడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్(టీఎంఎస్టీఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం ప్రతినిధులు శుక్రవారం మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్లను వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు అందజేశారు.
హెల్త్‌కార్డులు, కారుణ్య నియమకాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు భూతం యాకమల్లు, ప్రధాన కార్యదర్శి నగేశ్, వరప్రసాద్, ఆంజనేయులు, మహేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.