హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : ఐటీఐ కోర్సులు పూర్తిచేసిన వారికి పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ల్యాటరల్ ఎంట్రీ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఎల్పీ సెట్) పరీక్షకు 93.90శాతం విద్యార్థులు హాజరయ్యారు.
బాలురు 93.87, బాలికలు 97.74శాతం చొప్పున పరీక్షకు హాజరైనట్టు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు. 522 మంది అభ్యర్థులకు 508 మంది పరీక్షకు హాజరైనట్టు వెల్లడించారు.