ఖలీల్‌వాడి(నిజామాబాద్)/ నకిరేకల్/హనుమకొండ/కొత్తగూడెం గణేశ్‌టెంపుల్/ భద్రాచలం/ అశ్వారావుపేట, మే 15 : బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పలుపార్టీల ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ (ప్రజాపంథా), సీపీఎం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం, ఇల్లెందులో నిరసనలు తెలిపారు. ఇల్లెందు మం డలం కొమరారం అంబేద్కర్ సెంటర్లో బండి భగీరథ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
అశ్వారావుపేటలో మాస్‌లైన్ ప్రజాపంథా డివిజన్ కార్యదర్శి గోకినపల్లి ప్రభాకర్ , కొత్తగూడెంలో ప్రజాపంథా డివిజన్ కార్యదర్శి జా టోత్ కృష్ణ, భద్రాచలంలో సీపీఎం పట్టణ కా ర్యదర్శి గడ్డం స్వామి మాట్లాడుతూ కేంద్ర మంత్రి కుమారుడి కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పోక్సో కేసులో తన కొడుకును రక్షించుకునేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న కేంద్ర మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తకళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
శుక్రవారం హనుమకొండ జిల్లా కేంద్రంలోని కాళోజీ సెంటర్లో సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సాయిభగీరథ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఇంట్లోనే దాచిపెట్టారనే అనుమానం వ స్తున్నదని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. భగీరథ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నకిరేకల్ మెయిన్ సెంటర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బండి భగీరథ్ ఫ్లెక్సీలను దహనం చేశారు.
‘కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు బండి భగీరథ్ పరారీలో ఉన్నాడు.. ఆచూకీ తెలిసిన వారు సమీప పీఎస్‌లో సమాచారమివ్వాలి’ అని పేర్కొం టూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోస్టర్లను వెలిశాయి. నగర వ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో కనిపించడంతో ప్రజలు ఆసక్తిగా గమనిం చారు. ఇప్పటికే ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ప్రతిపక్ష నాయకులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.