హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): నాన్ క్యాడర్ పోలీసు అధికారుల బదిలీలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 8 మంది అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ ఎస్పీ(అడ్మిన్)గా ఉన్న కే ప్రసాద్‌ను సీఐడీ ఎస్పీగా, వరంగల్ ప్రిన్సిపల్ పీటీసీ పూజను తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎస్పీ(అడ్మిన్)గా బదిలీ చేసింది.
రాచకొండ ఎస్బీ అదనపు డీసీపీ ఎస్ రవిచంద్రను హైదరాబాద్ అదనపు ఎస్పీ(అడ్మిన్)గా, హైదరాబాద్ వెస్ట్ జోన్ అదనపు డీసీపీ టీ గోవర్ధన్‌ను ఎస్వోటీ అదనపు డీసీపీగా, అదనపు ఎస్పీ(వెయిటింగ్ లిస్టు) జీ నరేందర్‌ను ఇంటలిజెన్స్ అదనపు ఎస్పీగా, సీఐడీ అదనపు ఎస్పీ ఎం సుదర్శన్‌ను సైబరాబాద్ అదనపు డీసీపీగా, సీఐడీ ఎస్పీ కే వెంకటలక్ష్మీని హైదరాబాద్ నగర డీసీపీ(అడ్మిన్)గా బదిలీ చేసింది. తెలంగాణ సివిల్ సైప్లెస్ కార్పొరేషన్ అదనపు ఎస్పీ ఎస్ సూర్యనారాయణను ఏసీబీ డీజీ ఆఫీస్‌కు అటాచ్ చేసింది.
హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పులుల గణనకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే జనవరి 17 నుంచి వారం రోజుల పాటు పులుల గణన చేపట్టనున్నారు. ఇందులో ప్రజలు కూడా భాగస్వాములు కానున్నారు. గణనలో పాల్గొనడానికి ఇప్పటికే దాదాపు 4వేల మంది దరఖాస్తు చేశారు.