హైదరాబాద్ : శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు అధికారులు నిఘా వేశారు. ఈకే524 విమానంలో దుబాయి నుంచి ఇద్దరు వ్యక్తులు శంషాబాద్‌కు ఆరు కిలోల బంగారాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. బంగారాన్ని ఎమర్జెన్సీ లైట్లో పెట్టి తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న బంగారం విలువ రూ.2.90 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.